భారతదేశం, ఫిబ్రవరి 10 -- గ్రహాలు ఎప్పటికప్పుడు సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. చంద్రుడు మనసుకు, తల్లి, మానసిక స్థితి, సృజనాత్మకతకు కారకుడు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, మనసును చంద్రుడు నియంత్రిస్తాడు. మానసిక స్థిరత్వం, భావోద్వేగ శ్రేయస్సుపై ఎంతో ప్రభావం చూపిస్తాడు.

చంద్రుడు వేగంగా కదిలే గ్రహం. రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే వ్యక్తి మానసికంగా బలంగా, దృఢంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. బలహీనమైన చంద్రుడు వలన జ్ఞాపకశక్తి లోపం, మానసిక బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఫిబ్రవరి 10, అనగా ఈ రోజు, చంద్రుడు రాశి మార్పు చెందాడు. చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చంద్ర సంచారంలో మార్పు వలన ఏ ర...