భారతదేశం, మార్చి 30 -- ఎల్2: ఎంపురాన్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. మలయాళ సీనియర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం మార్చి 27న విడుదలైంది. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. పృథ్విరాజ్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. అయితే, ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎంపురాన్‍పై వివాదం రేగింది. తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో మోహన్‍లాల్ నేడు (మార్చి 30) స్పందించారు. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఏమైందంటే..

ఎల్2: ఎంపురాన్ మూవీలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఈ అల్లర్లలో తప్పు ఒకే వర్గానిది అన్నట్టుగా మేకర్స్ చూపించారు. మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో ఎదిగారనేలా ఈ మూవీలో విలన్ పాత్రను డైరెక్టర్ చూపించారు. ఈ అంశాలపై కొన్ని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ దుష్ప్రచార...