భారతదేశం, సెప్టెంబర్ 17 -- నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్​ఎస్​ఎస్​)లో ఒక సామాన్య ప్రచారక్‌గా మొదలై.. భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన, ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగిన ఆయన జీవితం - సిద్ధాంతం (సూత్రాలు), సేవ, సమర్పణ (అంకితభావం), సంఘటన్ (సంస్థాగత నిర్మాణం), సంఘర్షణ, సుపరిపాలనకు అద్దం పడుతుంది.

గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో మోదీ ప్రయాణం మొదలైంది. ఆర్​ఎస్​ఎస్ ప్రచారక్‌గా ఆయన బాల్యం, యవ్వనం.. క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవాభావనతో ముడిపడి ఉన్నాయి. ప్రచారక్‌గా దేశమంతా పర్యటించి, కార్యక్రమాలు నిర్వహించారు, కార్యకర్తలను సమీకరించారు. ఆనాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆయన ప్రధానిగా సాధించిన 370, 35ఏ ...