భారతదేశం, మార్చి 24 -- MMTS Rape Attempt: హైదరాబాద్లో ఎంఎంటిఎస్ రైల్లో అనంతపురానికి చెందిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనతో తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైలు నుంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి జరిగింది. యువకుడి నుంచి తప్పిం చుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.