తెలంగాణ,హైదరాబాద్, మార్చి 23 -- తెలంగాణ వేదికగా(హైదరాబాద్) మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి 31వ తేదీ వరకు.72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలిరానున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అందం, ప్రతిభను చాటడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని. విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి..

Published by HT Digital Content Services with permission from HT Telu...