భారతదేశం, ఏప్రిల్ 14 -- పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ 'మోసం' కేసులో భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాపారవేత్త తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి దేశంలోని ఆంట్వెర్ప్​లో నివసిస్తున్నట్లు మీడియా నివేదికలు ధృవీకరించిన కొన్ని వారాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

వజ్రాల వ్యాపారిని శనివారం అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్​పోల్​ ఆయన అరెస్ట్​పై రెడ్​ నోటీస్​ని డిలీట్​ చేసిన అనంతరం, భారత్​కు చెందిన ఈడీ, సీబీఐలు బెల్జియం అధికారులకు మెహుల్​ చోక్సీ అప్పగింత కోసం అభ్యర్థన చేసినట్టు, ఆ తర్వాతే ఈ అరెస్ట్​ జరిగినట్టు సమాచారం.

మెహుల్​ చోక్సీని భారత్​కు అప్పగించాలని అధికారులు బెల్జియం అఫీయల్స్​ని అడిగినట్టు మార్చ్​లో కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి.

గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకు...