భారతదేశం, మార్చి 21 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూపీ మీరట్​లో సౌర్​భ్​ రాజ్​పుట్​ని హత్య చేసినట్టు అతని భార్య ముస్కాన్​ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్​ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే అసలేం జరిగిందో వివరించారు.

ముస్కాన్​ రస్తోగి- సాహిల్​లు ఒకటే స్కూల్​లో చదివారు. అయితే 2019లో వాట్సాప్​ గ్రూప్​లో స్కూల్​ ఫ్రెండ్స్​ రీ-కనెక్ట్​ అయ్యారు. వీరందరు కలిసి మీరట్​లోని ఓ మాల్​లో సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఈ పార్టీలోనే ముస్కాన్​- సాహిల్​లు కలుసుకున్నారు. ఇది అఫైర్​కి దారి తీసింది. కానీ ముస్కాన్​కి సౌరభ్​ రాజ్​పుట్​తో వివాహం జరిగింది. కాగా.. ఉద్యోగం రిత్యా సౌరభ్​ లండన్​లో ఉండేవాడు. ఫలితంగా కొత్త అఫైర్ బాగా బలపడింది.

వీరి బంధం వెనుక డ్...