భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మారుతీ సుజుకీ మోడల్స్​లో డిజైర్​ ఒకటి. ఈ డిజైర్​కి సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని గతేడాది నవంబర్​లో సంస్థ లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్​లిఫ్ట్​​ ధరను తొలిసారి పెంచింది. సబ్ కాంపాక్ట్ సెడాన్ ధరలను మొత్తం శ్రేణిలో కనీసం రూ .5,000 పెంచింది. దీంతో డిజైర్ ప్రారంభ ధర రూ.6.79 లక్షల నుంచి రూ.6.84 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సబ్ కాంపాక్ట్ సెడాన్ స్పేస్​లో డిజైర్ అత్యంత ప్రజాధారణమైన ప్రాడక్ట్​ అనడంలో సందేహం లేదు. కొత్త అవతారంలో డిజైర్ డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా చాలా మార్పులతో వచ్చింది. సెడాన్ లుక్ కొత్త ఫ్రంట్ ఫేస్​తో వస్తోంది.

తాజా పెంపుతో, మారుతీ సుజుకీ డిజైర్ శ్రేణి ఇప్పుడు రూ .6.84 లక్షల ఎక్స్​షోరూం ధర నుంచి ప్రారంభమవుతుంది...