Hyderabad, మార్చి 21 -- Mango Kheer: మామిడి పండుతో చేసే ఎన్నో టేస్టీ వంటలు చేసుకోవచ్చు. తీయని మామిడి పండుతో పాయసం చేసుకుని చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ గా ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇది టేస్టీ డిజర్ట్ అనే చెప్పుకోవాలి. దీన్ని కేవలం పదినిమిషాల్లో చేసుకోవచ్చు. కానీ ఫ్రిజ్‌లో కనీసం రెండు గంటల సేపు ఉంచాలి.

పాలు - ఒక లీటరు

మామిడి పండు గుజ్జు - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

పంచదార - ఎనిమిది స్పూన్లు

వండిన అన్నం - అయిదు స్పూన్లు

యాలకుల పొడి - చిటికెడు

1. బాగా పండిన మామిడి పండ్లను ఈ పాయసం కోసం ఎంచుకోవాలి.

2. మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి ఒక కప్పులో వేయాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. చిన్న మంట మీద వాటిని ఉడికించుకోవాలి.

4. ఆ పాలల్లో ముందుగ...