భారతదేశం, మార్చి 11 -- సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు, భ‌క్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్) నిధుల నుంచి బస్సులను సమకూర్చాలని.. మేఘా కంపెనీని మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన.. మేఘా.. రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.

ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోంది. ఎయిమ్స్‌కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప...