భారతదేశం, మార్చి 3 -- Manamey OTT: శ‌ర్వానంద్ మ‌న‌మే మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు స‌మాచారం. ఈ వారంలోనే మ‌న‌మే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌న‌మే సినిమాలో శ‌ర్వానంద్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. శ‌ర్వానంద్ కామెడీ టైమింగ్‌, కృతిశెట్టితో అత‌డి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయినా రొటీన్ స్టోరీ కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు లాభాల‌ను రాబ‌ట్టింది.

మ‌న‌మే మూవీలో ...