భారతదేశం, మార్చి 4 -- ఓటీటీల్లో కొత్తగా మలయాళ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మలయాళ థ్రిల్లర్ చిత్రాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. ఓటీటీల్లో ఇతర భాషల్లోనూ ఈ సినిమాలు మంచి వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ఈనెల (మార్చి)లో మూడు మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ట్విస్టులతో సాగే ఈ సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈనెలలో ఓటీటీల్లోకి రానున్న మూడు టాప్ మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఇవే..

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రేఖాచిత్రం' థియేటర్లలో సూపర్ హిట్ అయింది. సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రేఖాచిత్రం సినిమా మార్చి 7వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడలోనూ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ ఇప్పట...