భారతదేశం, ఏప్రిల్ 15 -- Malayalam OTT:మ‌ల‌యాళం నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ సింజ‌ర్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్ చెల్లించి ఈ మూవీ అమెజాన్‌లో చూడొచ్చు.

65వ నేష‌న‌ల్ అవార్డ్స్‌లో సింజ‌ర్ మూవీ రెండు పుర‌స్కారాల‌ను సొంతం చేసుకున్న‌ది. బెస్ట్ జాస‌రీ లాంగ్వేజ్ మూవీగా, బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డులు ద‌క్కాయి. సింజ‌ర్ మూవీలో శ్రింద‌, మైథిలి ముస్త‌ఫా కీల‌క పాత్ర‌లు పోషించారు. పాంప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2018లో థియేట‌ర్ల‌లో రిలీజైన సింజ‌ర్‌ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. కేర‌ళ స్టోరీకి ఈ మూవీ స్ఫూర్తి అంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఉగ్ర‌వాదుల చెర‌లో అక్ర‌మంగా బంధీ అవుతోన్న భార‌తీయ మ‌హిళ‌లు ఎలాంటి వేధింపుల‌ను ఎదుర్కొంటు...