భారతదేశం, మార్చి 2 -- Malayalam OTT: వినీత్ శ్రీనివాస‌న్ హీరోగా న‌టించిన ఈ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మ‌ల‌యాళం మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆరు జాతి జాత‌కం మూవీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న థియేట‌ర్ల‌లో రిలీజైంది. మోహ‌న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో క‌య‌దు లోహ‌ర్‌, ఇషా త‌ల్వార్‌, నిఖిలా విమ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ రొమాంటిక్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ మూవీలో వినీత్ శ్రీనివాస‌న్ కామెడీ టైమింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

జ‌యేష్ (వినీత్ ...