భారతదేశం, ఏప్రిల్ 5 -- Malayalam Movie: పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ తీర్పు తెలుగులో అదే పేరుతో డ‌బ్ అయ్యింది. ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది. తీర్పు మూవీలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌తో పాటు ఇంద్ర‌జీత్ సుకుమార‌న్‌, ఇషా త‌ల్వార్, విజ‌య్ బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ర‌తీష్ అంబాట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన తీర్పు మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన విజ‌య్ బాబు...డైరెక్ట‌ర్ ర‌తీష్ అంబాట్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ముర‌ళీ గోపీ క‌లిసి తీర్పు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. తీర్పు మూవీకి హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్ దాస్ వాయిస్ ఓవ‌ర...