భారతదేశం, ఏప్రిల్ 30 -- Mahindra XUV 3XO launch date : గత కొన్ని రోజులుగా మహీంద్రా అండ్​ మహీంద్రా ఊరిస్తూ వస్తున్న మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ.. ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇది.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ధర రూ.7.49 లక్షల వద్ద ప్రారంభమై.. రూ. 15.49 లక్షల వరకు వెళుతుంది. ఇవి ఎక్స్​షోరూం ధరలు. లాంచ్​ నేపథ్యంలో.. ఈమహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూద్దాము..

మహీంద్రా ఎక్స్​యూవీ300తో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓని పోల్చితే.. డిజైన్​ పరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఫ్రెంట్​ ఫాసియోలో గ్లాసీ బ్లాక్​ గ్రిల్​ విత్​ క్రోమ్​ స్లాట్స్​ వస్తున్నాయి. అవి మరింత అట్రాక్టివ్​గా ఉన్నాయి. ఇక ఎక్స్​యూవీ700 కనిపించే కొత్త ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ కూడా ఉన్నాయి.

మర...