భారతదేశం, మార్చి 17 -- మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల డెలివరీ త్వరలో ప్రారంభం కానుంది. మార్చ్​ 2025 మధ్య నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఇంతకు ముందు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను 2024 నవంబర్​లో లాంచ్ చేశారు. బుకింగ్ ప్రారంభించిన తొలిరోజే 30 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెనీ తెలిపింది. వీటిల్లో ఎక్స్​ఈవీ 9ఈకి 56శాతం, బీఈ 6కి 44 శాతం బుకింగ్స్​ వచ్చాయి. మహీంద్రా మొదటి రోజు రూ .8472 కోట్ల రిజిస్టర్డ్ బుకింగ్ వాల్యూను (ఎక్స్-షోరూమ్ ధర వద్ద) వసూలు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదటి దశలో, అంటే మార్చ్​ మధ్యలో, కంపెనీ రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీల టాప్ స్పెక్ వెర్షన్లను (ప్యాక్ త్రీ) మాత్రమే అందించాలని యోచిస్తోంది! రెండు ఎస్​యూవీల ప్యాక్ త్రీ సెలెక్ట్ వేరియంట్ డెలివర...