మహబూబాబాద్,తెలంగాణ, మార్చి 6 -- బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే సదరు వ్యక్తులను ఫొటోలు తీసి, కోర్టుకు పంపించే పోలీసులు.. అందరిలా తామెందుకు చేయాలనుకున్నారో ఏమో.. ఏకంగా పోలీస్​ స్టేషన్​ నే బెల్ట్​ షాప్​ గా మార్చారు. ఎక్కడో పార్టీ చేసుకుని ఇబ్బందులు పడేకంటే స్టేషన్​ లోనే దర్జాగా మందేస్తే అయిపోతుందిలే అనుకుని, స్టేషన్​ నే పర్మిట్​ రూంగా మార్చుకుని పెగ్గు లాగించేశారు.

వివిధ సమస్యలతో స్టేషన్​ కు వచ్చే ఫిర్యాదు దారులకు కూడా పట్టించుకోకుండా మద్యం మత్తును ఎంజాయ్​ చేశారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఫొటో తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఇష్యూ కాస్త వైరల్​ గా మారింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర పోలీస్​ స్టేషన్​ లో ఓ హెడ్​ కానిస్టేబుల్​, మరో కానిస్టేబుల్​ కలిసి మందు పార్టీకి స...