భారతదేశం, ఫిబ్రవరి 14 -- Maha Kumbh 2025 record: మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణి సంగమంలో ఇప్పటివరకు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లు దాటింది. ఈ సంఖ్య దాదాపు చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ. యూపీ ప్రభుత్వం ఈ వివరాలను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే 1 కోటి మందికి పైగా పవిత్ర స్నానాలను ఆచరించారని తెలిపింది. మొత్తంగా, శుక్రవారం, ఫిబ్రవరి 14 సాయంత్రం వరకు మహా కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదు.

మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ప్రస్తుత సంఖ్య అన్ని అంచనాలను మించి...