భారతదేశం, మార్చి 2 -- మ‌ల‌యాళ న‌టుడు షేన్ నిగ‌మ్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ అదే పేరుతో ఇటీవ‌ల తెలుగులోకి డ‌బ్ అయ్యింది. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా న‌టించింది. వాలిమోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?

స‌త్య‌మూర్తి (షేన్ నిగ‌మ్‌), మీరా (నిహారిక కొణిదెల‌) ప్రేమించుకుంటారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తారు. మ‌రో కొద్ది గంట‌ల్లో పెళ్లి ఉంద‌న‌గా మీరాను క‌ల‌వ‌డానికి కారులో విడిది ఇంటికి వెళ‌తాడు స‌త్య‌మూర్తి. దారిలో ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్ర‌మాదంలో క‌ళ్యాణి (ఐశ్వ‌ర్య ద‌త్తా) అనే ప్రెగ్నెంట్ లేడీ గాయ‌ప‌డుతుంది. ఆమె క‌డుపులోని బిడ్డ చ‌నిపోతుంది. క‌ళ్యాణి భ‌ర్త సింగం(క‌లైయర‌స‌న్‌) పెద్ద రౌడీ.

త‌న బిడ్డ...