భారతదేశం, ఫిబ్రవరి 25 -- గత కొన్నేళ్లుగా ఆమ్​ ఆద్మీ పార్టీని కుదిపేస్తున్న దిల్లీ లిక్కర్​ పాలసీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021-2022 లిక్కర్​ పాలసీ కారణంగా దిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ఓ కాగ్​ రిపోర్టు పేర్కొంది. ఈ మేరకు దిల్లీ లిక్కర్​ పాలసీపై రూపొందించిన ఈ సమగ్ర రిపోర్టును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అరవింద్​ కేజ్రీవాల్​ ఆమ్​ ఆద్మీ.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన లిక్కర్​ పాలసీపై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలసిందే. ఆ తర్వాత ఈ పాలసీని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. కానీ అప్పటికే ఇది విపక్ష బీజేపీ విమర్శల అస్త్రంగా మారింది.

ఇక ఈ వ్యవహారంపై నూతన సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ కాగ్​ రిపోర్టును ప్రవేశపెట్టింది. లైసెన్స్​ జారీ ప్రక్రియలో అనేక తప్పిదాలు జరిగాయని నివేదిక చెబుతోంది. ...