భారతదేశం, ఫిబ్రవరి 19 -- ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) స్మార్ట్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అనేక ఫీచర్లు ఉన్నట్టుగా ఎల్ఐసీ తెలిపింది. ఈ పథకం పెన్షన్ కోసం, ఒక వ్యక్తికి ఉమ్మడిగా వివిధ రకాల ఆప్షన్స్ అందిస్తుంది. ఈ పథకాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు, ఎల్ఐసీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మొహంతి ప్రారంభించారు. ఈ పాలసీ నిబంధనల ప్రకారం పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణకు అనేక నగదు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని ఎల్ఐసీ తెలిపింది.

ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యూవల్/గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్. పెన్షన్, రిటైర్మెంట్ సేవింగ్ విభాగంలో ఈ కొత్త ప్లాన్ విప్లవాత్మకంగా మారుతుంది ఎల్ఐసీ పేర్కొంది. పదవి విరమణ కోసం పొదుపు చేయడానికి...