భారతదేశం, అక్టోబర్ 13 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా స్టాక్​ మార్కెట్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది. సబ్‌స్క్రిప్షన్ విండోలో పెట్టుబడిదారుల నుంచి బలమైన స్పందన లభించిన అనంతరం, ఎల్​జీ ఎలక్ట్రానిక్స్​ ఐపీఓ.. అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ రోజున ఈ షేరు పనితీరు ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

ఎల్​జీ ఎలక్ట్రానిక్స్​ ఐపీఓ లిస్టింగ్‌కు ముందు గమనించాల్సిన ముఖ్య అంశాలును ఇప్పుడు తెలుసుకుందాము.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు అక్టోబర్ 10న ఖరారైంది.

ఐపీఓ అలాట్​ అయిన వారికి షేర్లు లిస్టింగ్​కి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్​ 13న వారి డీమ్యాట్​ అకౌంట్​లోకి వస్తాయి.

ఎల్​జీ ఎలక్ట్రానిక్స్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9...