Hyderabad, ఏప్రిల్ 3 -- L2 Empuraan Controversy: మలయాళ స్టార్లు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ఎల్2 ఎంపురాన్ వివాదం పార్లమెంట్ కు చేరింది. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ ఈ సినిమాకు 24 కట్స్ చేయడంపై గురువారం (ఏప్రిల్ 3) పార్లమెంట్ లో స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యసభలో గురువారం ఎంపీ జాన్ బ్రిటాస్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై మాట్లాడారు. ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను చూపించినందుకే రాజకీయ ఒత్తిడి పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సమాధానమిచ్చారు. "అసలు వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో ఒకే నిజం ఉంది. దీనిని భారతీయులందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎంపురాన్ ప్రొడ్యూసర్లపై ఎలాంటి సెన్సార్ ఒత్తిళ్లు లేవు" అని స్పష్టం చేశారు.

ఇక సినిమా థ్యాంక్యూ కార్డు న...