ఆంధ్రప్రదేశ్‌, నవంబర్ 29 -- Kurnool Meeting ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వమించాలని నాన్‌ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. దాదాపు లక్షమందితో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని జేఏసీ భావిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఇప్పటికే రాయలసీమలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటు హైకోర్టును తరలించాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నాన్‌ పొలిటికల్ జేఏసీ బావిస్తోంది.

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు ఇప్పటికే నిర్వహించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజ...