భారతదేశం, ఫిబ్రవరి 23 -- చాలా మందికి ఈ విషయం తెలియదు. కుమారస్వామి పార్వతీదేవి పుత్రుడా, లేదంటే గంగాదేవి పుత్రుడా అని.. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? కుమారస్వామి ఎవరి పుత్రుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ మానసపుత్రుడు అయిన సనత్కుమారుడు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎల్లవేళలా ఆయన తపస్సులోనే నిమగ్నం అయ్యేవాడు. వైరాగ్యమూర్తి అయిన సనత్కుమారుడికి ఇంకో జన్మ ఉందని తెలిసిన పార్వతీ పరమేశ్వరులు తపోనిష్ఠగా గరిష్ఠుడైన సనత్కుమారుడిని పుత్రుడిగా పొందాలని అనుకున్నారు. అందుకు సంకల్పించి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న సనత్కుమారుడి దగ్గరకు వెళ్లి, "సనత్కుమారా! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలని నేను కోరుకుంటున్నాను" అని అడగగా, సనత్కుమారుడు అలాగే అవుతుందని వరం ఇచ్చాడు.

ఇది తెలిసిన పార్వతీదేవి ఎంతో ఆశ్చర్యపోయింది. "పురుషుడైన నీవు నాకు పుత్రుడిగా జన్...