తెలంగాణ,హైదరాబాద్, మార్చి 21 -- తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉంది. దాదాపు 15 నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ. అంశాలవారీగా పోరాటం చేస్తూ వస్తోంది. ఆరు నెలల వరకు వేచి చూసిన ఆ పార్టీ నాయకత్వం. ఆ తర్వాత స్పీడ్ పెంచేసింది. హైడ్రా బాధితుల మొదలుకొని. లగచర్ల వరకు బాధితులకు అండగా ఉంటూనే. క్షేత్రస్థాయిలో దూకుడు పెంచే పనిలో పడింది.

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామన్న సందేశాన్ని పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. ఇక ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలక నేతలుగా ఉన్న హరీశ్ రావ్, కేటీఆర్ ఈ విషయంలో దూకు...