భారతదేశం, మార్చి 7 -- రెండు పాప్యులర్​ 125సీసీ బైక్స్​ని కేటీఎం డిస్కంటిన్యూ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అవి.. కేటీఎం డ్యూక్​ 125, కేటీఎం ఆర్​సీ 125. మరి ఈ వార్తల్లో నిజమెంతా?

కేటీఎం డ్యూక్ 125, కేటిఎం ఆర్​సీ 125 బైక్స్​ అమ్మకాలు ఏప్రిల్​ 1 నుంచి నిలిపివేయాలని కేటిఎం నిర్ణయించినట్టు పలు నివేదికలు బయటకు వచ్చాయి. ఈ బైక్​లలో పనిచేసే 125సీసీ ఇంజిన్ ఓబీడీ -2డీ అప్​డేట్​లను పొందవని నివేదికలు చెప్పాయి. ఎందుకంటే ఈ అప్​గ్రేడ్ ఆర్థికంగా లాభదాయకం కాదని బైక్ తయారీదారు అంచనా వేసినట్టు వివరించాయి.

అయితే, ఈ వార్తల్లో నిజం లేదని కేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు బైక్స్​ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు తాము అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని, ఇది తప్పుడు సమాచారం అని, కేటీఎం ఆర్థిక పునర్నిర్మాణంతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

"కేటీఎం కానీ, బజాజ్​ ...