భారతదేశం, ఏప్రిల్ 5 -- అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో లివర్ ఇన్ఫెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. పల్లం అనే గ్రామంలో లివర్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రబలాయి. దీంతో 2,200 మందికి వైద్య సిబ్బంది లివర్‌ టెస్టులు చేశారు. వారిలో 16 మందికి హెచ్‌బీఎస్ఏజీ సోకినట్టు నిర్థారణ అయ్యింది. మరో 9 మందికి హెచ్‌సీవీ సోకినట్టు వైద్యులు గుర్తించారు. కాలేయ ఇన్ఫెక్షన్లు అనేక రకాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాటిలో కొన్ని సాధారణమైనవి, కొన్ని తీవ్రమైనవని అంటున్నారు.

హెపటైటిస్ ఎ : ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా స్వల్పకాలిక ఇన్ఫెక్షన్. దీర్ఘకాలిక కాలేయ నష్టాన్ని కలిగించదు.

హెపటైటిస్ బి : ఇది రక్తం, శరీర ద్రవాలు, తల్లి నుండి బిడ్డకు పుట్టే సమయంలో వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్, కాలేయ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది.

హెపటైట...