భారతదేశం, ఫిబ్రవరి 19 -- పశ్చిమ్​ బెంగాల్​ కోల్​కతాలో 7 నెలల పసికందును రేప్​ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది! గతేడాది జరిగిన ఈ ఘటనను, అత్యంత అరుదైన ఘటనగా గుర్తిస్తూ, సదరు వ్యక్తిని అరెస్ట్​ చేసిన 75 రోజుల్లోపే తీర్పును వెలువరించింది పోక్సో కోర్టు.

ఉత్తర కోల్​కతాలోని బుర్తల్లాలో 2024 డిసెంబర్​ 1న ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక పసికందు ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. ఆ పసికందుకు రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. రిపోర్టులను చూసి, పసికందుపై అత్యాచారం జరిగినట్టు నిర్థరించారు.

"నవంబర్​ 30- డిసెంబర్​ 1 అర్థరాత్రి సమయంలో పసికందును నిందితుడు 30 నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టాడు. తల్లితండ్రులతో కలిసి ఫుట్​పాత్​ మీద పడుకున్న పసికందును ఎత్తుకె...