భారతదేశం, మార్చి 7 -- మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ హీరోగా న‌టించిన త‌మిళ హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ మూవీ కింగ్‌స్ట‌న్ సేమ్ టైటిల్‌తో మార్చి 7న (నేడు) తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దివ్య‌భార‌తి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు క‌మ‌ల్ ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ త‌మిళ డ‌బ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

స‌ముద్రానికి స‌మీపంలో ఉన్న తూతువురు గ్రామానికి చాలా కాలంగా శాపం వెంటాడుతుంది. చేప‌ల వేట కోసం స‌ముద్రంలోకి వెళ్లిన ఊరివాళ్లంతా శ‌వాలై తిరిగివ‌స్తుంటారు. బోస‌య్య అనే వ్య‌క్తి ఆత్మ ఈ దారుణాల‌కు పాల్ప‌డుతుంద‌ని తూతువురు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతుంటారు. ప్ర‌జ‌ల్లోని భయాన్ని, మూఢ‌న‌మ్మ‌కాల‌ను ఆస‌రాగా చేసుకుంటాడు థామ‌స్‌.

చేప‌ల వ్యాపారం పేరుతో ఊరి జ‌నాల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న‌ట్లు న‌మ్మిస్తూ వారి డ్ర‌గ్స్ స‌ప్లై...