భారతదేశం, మార్చి 5 -- Kia Sonet vs Mahindra XUV300 : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో ఒకటి కియా సోనెట్​. సెల్టోస్​ సక్సెస్​ తర్వాత.. ఈ మోడల్​ని ఇండియాలోకి తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఈ ఏడాది జనవరిలో కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సైతం లాంచ్​ చేసింది. ఫలితంగా.. సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా.. మహీంద్రా ఎక్స్​యూవీ300కి కియా సోనెట్​కి మధ్య పోటీ మరింత పెరిగింది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? అని కస్టమర్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? ఏది కొనాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము. కియా సోనెట్ - మహీంద్రా ఎక్స్ యువి 300 మధ్య ధర, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల ఆధారంగా పోలికను పరిశీలిద్దాం.

కియా సోనెట్​ ఎస్​యూవీలో రెండు పెట్రోల్ ఇంజన్లు, ఒక డీజ...