భారతదేశం, డిసెంబర్ 8 -- ఇటీవ‌ల కాలంలో ఓటీటీ ప్రేక్ష‌కుల్ని మెప్పించిన‌ వెబ్‌సిరీస్‌ల‌లో ఖాకీ ది బిహార్ చాప్ట‌ర్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే క‌థ‌ను అందిస్తూ షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సిరీస్‌కు భ‌వ్‌ దులియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐపీఎస్ ఆఫీస‌ర్ అమిత్ లోధా రాసిన బిహార్ డైరీస్ బుక్ ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్కింది. క‌ర‌ణ్ ట‌క్క‌ర్‌(Karan Tacker), అవినాష్ తివారీ(Avinash Tiwary), అభిమ‌న్యుసింగ్‌, ర‌వికిష‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉందంటే...

అమిత్ లోధా (క‌ర‌ణ్ ట‌క్క‌ర్‌) ఐఐటీ గ్రాడ్యుయేట్‌. స‌మాజంలో మార్పు తీసుకురావాల‌నే ఆశ‌యంతో యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్‌గా సెలెక్ట్ అవుతాడు. తొలి పోస్టింగ్ బిహార్‌లో వ‌స్తుంది. తొలుత వృత్తి నిర్వ‌హ‌ణ‌లో ఇబ్బందులు ప‌డిన అమిత్ ఆ త‌ర్...