భారతదేశం, ఫిబ్రవరి 18 -- మీరు మంచి, స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆలోచిస్తుంటే కవాసకి నింజా 650 బాగుంటుంది. ఈ గొప్ప బైక్‌పై కంపెనీ రూ. 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మీరు బైక్ ఎక్స్-షోరూమ్ ధరపై దీనిని రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం..

కవాసకి నింజా 650 దాని విభాగంలో అత్యుత్తమ స్పోర్ట్స్ టూరింగ్ బైక్‌లలో ఒకటి. ఇది పవర్‌ఫుల్ బైక్. సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 649cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 67బీహెచ్‌పీ శక్తిని, 64ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హైవేపై సాఫీగా ప్రయాణించడానికి, నగర ట్రాఫిక్‌లో అద్భుతమైన పనితీరును ఇస్తుంది.

ఫీచరల్లో నింజా 650 కూడా తక్కువేమీ కాదు. ఈ బైక్ TFT డిస్‌ప్లే(బ్లూటూత్ ...