Hyderabad, ఫిబ్రవరి 14 -- Katrina Kaif Chhaava Review: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా (Chhaava). ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ఇందులో రష్మిక మందన్నా కూడా నటించింది. ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వస్తుండగా.. తాజాగా విక్కీ కౌశల్ భార్య, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రివ్యూ ఇచ్చింది. ఇదొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటూనే తన భర్తను ఓ ఊసరవెల్లి అని సరదాగా కామెంట్ చేసింది.

కత్రినా కైఫ్ శుక్రవారం (ఫిబ్రవరి 14) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛావా మూవీపై ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. మరి ఆమె రివ్యూ ఎలా ఉందో చూద్దాం. "ఛత్రపతి శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని చాలా గొప్పగా చూపించారు.

ఇదొక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. లక్ష్మీకాంత్ ఉటేకర్ ఈ అద్భుతమైన స్టోరీని చాలా అద్భుతంగా చూపించారు. నాకు మాటలు రావడం లేదు. చివరి 40 నిమి...