Hyderabad, మార్చి 21 -- Karthika Deepam Preview: తెలుగువారు ఎంతగానో మెచ్చిన సీరియల్ కార్తీకదీపం మరోసారి రాబోతోంది. స్టార్ మా ఛానెల్ ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయనుంది. కొత్త సీజన్ ప్రారంభానికి ముందు గురువారం (మార్చి 21) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సీరియల్ యాక్టర్స్, మేకర్స్ గ్రాండ్ గా ఓ ప్రివ్యూ ఈవెంట్ ఏర్పాటు చేయడం విశేషం.

కార్తీకదీపం సీరియల్ మార్చి 25 నుంచి స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ను ప్రసారం చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఏడాది తర్వాత ఇప్పుడు కార్తీకదీపం ఇది నవవసంతం పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు.

ఈ ఈవెంట్ కు సీరియల్లో ప్రధాన పాత్రలు పోషించిన నిరుపమ్ పరిటాల, ప్రేమి వ...