భారతదేశం, జనవరి 31 -- శౌర్య ట్రీట్‌మెంట్‌కు తాను సాయం చేస్తాన‌ని దీప‌తో అంటుంది జ్యోత్స్న. కోటి రూపాయ‌ల చెక్ ఇస్తుంది. కార్తీక్‌తో దీప‌కు ఏం సంబంధం లేద‌ని పేప‌ర్స్ సిద్ధం చేసుకొని వ‌స్తుంది జ్యోత్స్న‌. డ‌బ్బు కావాలంటే ఈ పేప‌ర్స్‌పై సంత‌కం పెట్ట‌మ‌ని దీప‌కు కండీష‌న్ పెడుతుంది. ఈ డ‌బ్బు తీసుకొని నీ కూతురిని బ‌తికించుకోమ‌ని, ఆ త‌ర్వాత కార్తీక్‌ను త‌న‌కు వ‌దిలిపెట్టి ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని అంటుంది. కార్తీక్‌ను నాకు వ‌దిలేయ‌డానికి ఈ కోటి రూపాయ‌లు స‌రిపోవంటే ఇంకో కోటి ఇస్తాన‌ని దీప‌తో చెబుతుంది జ్యోత్స్న‌.

డ‌బ్బులు వ‌ద్దంటే పోయేది అవ‌కాశ‌మే కాదు నీ కూతురు ప్రాణాలు కూడా అంటూ దీప‌ను ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది జ్యోత్స్న‌. ఏ కూతురు కోస‌మైతే నువ్వు ఇన్ని బాధ‌లు ప‌డ్డావో ఆ కూతురే ఇప్పుడు చావు బ‌తుకుల్లో ఉంది. త‌ల్లిగా నువ్వు కాపాడుకోవాల...