భారతదేశం, ఏప్రిల్ 9 -- టాలీవుడ్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ మూవీ గోపీలోల ఓటీటీలోకి వ‌చ్చింది. బుధ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ క‌న్న‌డ మూవీలో మంజునాథ్ అరుసు, నిమిషా కే చంద్ర హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి క‌నిపించాడు. గోపీలోల మూవీకి ఆర్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గోపీలోల మూవీ ఇటీవ‌ల యూట్యూబ్‌లో రిలీజైంది. క‌న్న‌డంతో పాటు తెలుగు భాష‌ల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‌లో రిలీజైన త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఆర్గానిక్ ఫామింగ్ గొప్ప‌తానికి ప్రేమ‌క‌థ‌ను జోడిస్తూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు గోపీలోల సినిమాను తెర‌కెక్కించాడు. జీరో ఫార్మ...