భారతదేశం, ఫిబ్రవరి 23 -- Jr Ntr: స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌. అత‌డి కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఎన్టీఆర్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్ర‌ముఖులు దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుక‌కు అటెండ్ అయ్యారు. ఈ పెళ్లి వేడుక‌ల తాలూకు ఫొటోల్లో ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌ణ‌తి, మ‌హేష్‌బాబు భార్య న‌మ్ర‌త‌తో పాటు కూతురు సితార‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతి కూడా క‌నిపించారు.

ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించాడు. ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో క‌ళ్లాద్ధాలు ధ‌రించి కొత్త అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఎన్టీఆర్ ఫొటోల‌ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌, దేవ‌ర సినిమాల్లో పీరియాడిక్ లుక్‌లోనే ఎన్టీఆర్ క‌నిపించ...