Hyderabad, మార్చి 10 -- Jiohotstar Record: ఓటీటీ స్ట్రీమింగ్ లో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను తిరగరాసింది ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఏకంగా 85 కోట్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. అంతేకాదు ఒకేసారి ఈ మ్యాచ్ ను లైవ్ లో 6.1 కోట్ల మంది చూడటం కూడా స్ట్రీమింగ్ లో సరికొత్త రికార్డు అని ఆ ఓటీటీ వెల్లడించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను టీమిండియా చిత్తు చేసి మూడోసారి ట్రోఫీ అందుకున్న క్షణాన్ని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. అలాగే ఈ మ్యాచ్ జియోహాట్‌స్టార్ లో క్రియేట్ చేసిన రికార్డులు కూడా ఇప్పట్లో మరేదీ తిరగరాయలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కు మొత్తంగా 85 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి.

అయితే ఇవి యూనిక్ వ్యూస్ కావు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఓ వ్యక్తి చూసిన వ్యూస్ కూడా ఇందులో నమోదవుతాయి. అలా చూసినా...