భారతదేశం, ఫిబ్రవరి 14 -- జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​ "జియోహాట్​స్టార్​"ని లాంచ్​ చేసింది. ఫలితంగా.. రెండు ప్రముఖ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​ జియోసినిమా- డిస్నీ + హాట్​స్టార్​లు విలీనమైపోయాయి. 50 కోట్లకు పైగా యూజర్ బేస్, 3 లక్షల గంటలకు పైగా కంటెంట్​తో ఈ కొత్త ప్లాట్​ఫామ్​.. భారత మార్కెట్లోనే అతిపెద్ద స్ట్రీమింగ్​ సర్వీస్​గా నిలిచింది.

ఒరిజినల్ కంటెంట్​తో పాటు డిస్నీ, ఎన్​బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్​బీ ఓ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్​కి కూడా ఈ కొత్త జియోహాట్​స్టార్​ నిలయంగా ఉంటుంది.

మరోవైపు ఈ జియోహాట్​స్టార్​లో క్రికెట్​ స్ట్రీమింగ్​కి అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. అనేక ప్రధాన ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇతర దేశవాళీ టోర్నమెంట్లను ప్రేక్షకులు ఇందులో చూడవచ్చు. ఇంగ్లిష్...