భారతదేశం, ఏప్రిల్ 13 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 ఆన్సర్​ కీ 2025లో అభ్యంతరాలు ఉన్నాయా? వాటిని సవాలు చేసేందుకు ఈరోజే లాస్ట్​ డేట్​. సెషన్​ 2కి సంబంధించిన అబ్జెక్షన్​ విండోను ఎన్టీఏ నేడు మూసివేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ సెషన్ 2 పేపర్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 11న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజు రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది.

"పేపర్​ 1 (బీఈ- బీటెక్​) ఆన్సర్​ కీతో పాటు రెస్పాన్స్​ షీట్​, క్వశ్చన్​ పేపర్లను jeemain.nta.nic.in లో అప్లోడ్​ చేశాము. ప్రొవిజనల్​ ఆన్సర్​ కీలో అభ్యంతరాలు తెలపాలనుకునే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200లు చెల్లించి సవాల...