తెలంగాణ,జనగామ, మార్చి 6 -- జనగామ జిల్లా కేంద్రంలో పది నెలల చిన్నారి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. దాదాపు పది రోజుల కిందట చిన్నారి కిడ్నాప్ కాగా.. ఇంతవరకు పోలీసులు దుండగులను గుర్తించలేకపోయారు. దీంతో పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి జనగామకు వచ్చిన ఆ దంపతులు దుఖ:సాగరంలో మునిగిపోయారు. ఓ వైపు కిడ్నాప్ అయిన తమ కూతురి కోసం వెతుకుతూనే మరోవైపు మిగతా పిల్లలను సాకేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చత్తీస్ గడ్ రాష్ట్రం ముంగేలి గ్రామానికి చెందిన పార్వతి, రామ్ జుల్ దంపతులు. పొట్టకూటి కోసం కొద్ది రోజుల కిందట జనగామ జిల్లా కేంద్రానికి వచ్చి.. స్థానిక కళ్లెం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు సంతానం. పార్వతీ, రామ్ జుల్ తమ పనిని తాము చేసుకుంటుండగా.. దాదాపు 20 రో...