భారతదేశం, ఫిబ్రవరి 1 -- Jagtial News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనడానికి జగిత్యాల జిల్లాకు చెందిన 11 మంది మహిళలు ఈ నెల 27న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. 29వ తేదీ సాయంత్రం వారు ప్రయాగ్ రాజ్ లోని సంఘం ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి రెండు గ్రూపులుగా విడిపోయి వెళ్లారు. ఈ క్రమంలో ఏనుగుల బుచ్చవ్వ, మరో ముగ్గురు మహిళలు బెల్లపు సత్తవ్వ, వీర్ల నరసవ్వ, ఆది రాజవ్వ జనసందోహంలో తప్పిపోయారు.
జిల్లాకు చెందిన 4 గురు మహిళలు తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఆ మహిళల వివరాలు తెలుసుకొని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పోలీసుల సహాయంతో నలుగురి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. ఇవాళ ఉదయం వారిని జగిత్యాలకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తప్పిపోయిన మహిళల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.