భారతదేశం, ఏప్రిల్ 10 -- ఈ ఏడాది తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో జాక్ ఒక‌టి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల త‌ర్వాత సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన జాక్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది. స్పై యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ హిట్ ఇచ్చాడా? లేదా? అంటే?

జాక్ అలియాస్ పాబ్లో నెరుడా(సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌) బీటెక్ పూర్తిచేస్తాడు. అత‌డి తెలివితేట‌ల‌కు చాలా ఉద్యోగాలు వ‌స్తాయి. కానీ ఆ జాబ్ ఆఫ‌ర్స్‌ను రిజెక్ట్ చేస్తాడు జాక్‌. ఎప్ప‌టికైనా రిసెర్చ్ ఎనాల‌సిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. రా ఇంట‌ర్వ్యూకు అటెండ్ అవుతాడు జాక్‌....