భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఆదాయ పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్​) దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 15. గడువుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ రిటర్న్‌లను ఫైల్ చేసి, ఇప్పుడు తమ పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయకపోతే, కొన్ని సాధారణ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.

"పన్ను చెల్లింపుదారులు చేసే పొరపాట్లలో ఒకటి, గడువుకు ఏడు రోజుల ముందు కూడా తమ వివరాలను పన్ను సలహాదారుకు పంపకపోవడం. దీనితో పాటు కొందరు తప్పుడు ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవడం, విదేశీ ఆస్తుల వివరాలను ఐటీఆర్‌లో వెల్లడించకపోవడం వంటి తప్పులు కూడా చేస్తారు," అని దిల్లీకి చెందిన పీడీ గుప్తా అండ్ కంపెనీ సంస్థ చార్టర్డ్ అకౌంటెంట్- భాగస్వామి ప్రతిభా గోయల్ చెప్పారు.

1. తప్పుడు ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవడం:

పన్ను చెల్లింపుదారులు చేస...