భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఇన్వెస్ట్​ చేసిన వారికి పీడకలలు చూపిస్తూ ఇన్ని రోజులుగా పతనమైన ఐటీ స్టాక్స్​లో ఫిబ్రవరి 17, మంగళవారం రికవరీ కనిపిస్తోంది. ఏఐ వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనల మధ్య భారీగా పడిపోయిన ఐటీ ఇండెక్స్​, తాజాగా దాదాపు 2శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు గ్రీన్ మార్క్‌లోకి వచ్చాయి.

ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్​ నెల రోజుల్లో 15శాతం మేర క్రాష్​ అయ్యింది.

నిఫ్టీ ఐటీ ఇండెక్స్: మంగళవారం ఉదయం సెషన్​లో 2.3% మేర పెరిగింది. డిసెంబర్ 2025లో నమోదైన గరిష్ట స్థాయి (41,530) నుంచి 21% పడిపోయిన తర్వాత, తాజాగా 'ప్రాఫిట్ బుకింగ్' కారణంగా రికవరీ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయంలో ఐటీ ఇండెక్స్​ 1.71శాతం లాభాలతో దూసుకెళుతోంది.

టాప్ గెయినర్స్: ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్...