భారతదేశం, మార్చి 12 -- IPS Officers Suspension : ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో సస్పెన్షన్ను సెప్టెంబరు 25 వరకు పొడిగించింది.
ముంబై నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టి వేధించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు చేసింది. తప్పుడు కేసులో సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లపై పలు అభియోగాలున్నాయి. ముగ్గురు అధికారులు అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు మేరకు ఐపీఎస్ల స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.