భారతదేశం, జనవరి 9 -- బెంగళూరు, కర్ణాటక ఫ్యాన్స్​కి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) పెద్ద షాక్​ ఇచ్చేడట్టే కనిపిస్తోంది! 2008లో ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను హోమ్​ గ్రౌండ్​గా చేసుకుని ఆడుతున్న ఆ జట్టు.. ఈసారి మాత్రం వెన్యూను షిఫ్ట్​ చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఐపీఎల్​ 2026లో విరాట్ కోహ్లీ అండ్ టిమ్​.. చిన్నస్వామి స్టేడియంలో కనిపించకపోవచ్చు.

హోమ్​ గ్రౌండ్​ని ఆర్సీబీ షిఫ్ట్​ చేయడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2025​ ట్రోఫీ విక్టరీ సెలబ్రేషన్స్​లో తొక్కిసలాట అని నివేదికలు చెబుతున్నాయి.

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025​ ట్రోఫీని విరాట్​ కోహ్లీ ఆర్సీబీ దక్కించుకుంది. కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్​కి ఇది ఒక మరపురాని జ్ఞాపకం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు నిలవలేదు! బెంగళూరులో ...