భారతదేశం, ఫిబ్రవరి 10 -- మచ్​ అవైటెడ్​ ఐఫోన్​ ఎస్​ఈ 4 రేపు, మంగళవారం లాంచ్​ అయ్యే అవకాశం ఉంది! లాంచ్​ డేట్​ని సంస్థ కరెక్ట్​గా చెప్పకపోయినా, ఈ వారంలో స్మార్ట్​ఫోన్​ని విడుదల అవుతుందని యాపిల్​ ఎనలిస్ట్​ మార్క్​ గర్మెన్​ తెలిపారు. ఇక ఇప్పుడు ఐఫోన్​ ఎస్​ఈ 4 లాంచ్​ డేట్​ ఫిబ్రవరి 11 అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే యాపిల్​ వెబ్​సైట్స్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాల్సిందే. ఎందుకుంటే, ఐఫోన్​ ఎస్​ఈ 4 లాంచ్​ కోసం యాపిల్​ స్పెషల్​ ఈవెంట్​ని ఏర్పాటు చేయడం లేదు! ఒకవేళ ఈవెంట్​ ఉండి ఉంటే, ఈపాటికే నోటిఫికేషన్​ వచ్చుండేది! ఈ నేపథ్యంలో ఈ ఐఫోన్​ ఎస్​ఈ 4పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ సమీపిస్తున్న కొద్దీ, యాపిల్ తన మోస్ట్​ అఫార్డిబుల్​ ఐఫోన్ కోసం ఏం ప్లాన్ చేస్తోందో అనే ఆసక్తి కనిపిస్తోం...